Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో మ్యాచ్కు సంబంధించిన టికెట్లు తీసుకునేందుకు నగరంలోని ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్లో మ్యాచ్ టికెట్లు బుక్ చేసుకున్నవారు భౌతిక టికెట్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎల్బీ స్టేడియంలో 8 కౌంటర్లు, 75 మంది పోలీసులు, గచ్చిబౌలి స్టేడియంలో 8 కౌంటర్లు, 80 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎల్బీ స్టేడియంలో ఇప్పటివకు 1,300 టికెట్లు, గచ్చిబౌలి స్టేడియంలో 500 టికెట్లును సిబ్బంది ఇచ్చారు. క్యూఆర్ కోడ్ చూపిస్తే స్కాన్ చేసి పేటీఎం సిబ్బంది టికెట్లను ఇస్తున్నారు.