Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరం రోడ్లన్నీ జనంతో నిర్మానుష్యంగా మారాయి. సంక్రాంతి పండుగ తరుణంలో నగరవాసులంతా స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో ఎక్కడ చూసినా రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. నిన్న వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు నేడు ఖాళీగా ఉన్నాయి. వ్యక్తిగత వాహనాలే కాకుండా ప్రయివేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో పండుగకు రెండు, మూడు రోజుల ముందు నుంచే నగరవాసులు తమ ఇళ్లకు బయలుదేరారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్లతో పాటు అన్ని రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్ హైవేల టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం భోగి కావడంతో గురు, శుక్రవారాల్లో నగరవాసులు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు వెళ్లారు.
జనవరి 12, 13 తేదీల్లో ఆయా హైవేలపై రెండున్నర లక్షలకు పైగా వాహనాలు టోల్ గేట్లను దాటినట్లు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ హైవేపై పంతంగి, వరంగల్ హైవేలోని బీబీ నగర్ టోల్ప్లాజాలపై 1లక్ష 49 వేల 403 వాహనాలు వెళ్లాయి. 1 లక్షా 14 వేల 249 వాహనాలు కార్లు కావడం గమనార్హం. విజయవాడ హైవేపై ఈ రెండు రోజుల్లో లక్షా 24 వేల 172 వాహనాలు ప్రయాణించాయని పోలీసులు తెలిపారు. అలాగే వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ కు 13 వేల 334 వాహనాలు వచ్చాయి. రాత్రి 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య నగరవాసులు ఎక్కువ మంది వాహనాల్లో ప్రయాణించారు.