Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీంనగర్
ప్రపంచ స్థాయి ఫౌంటెన్లతో కరీంనగర్ పట్టణాన్ని గొప్ప టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ పట్ణణంలోని పలు వార్డులో పర్యటించారు. ఈతరుణంలో పట్టణంలో రోడ్లు ఆక్రమణకు గురికాకుండా ప్రజలు, వ్యాపారులు సహకరించాలని సూచించారు. స్
వరాష్ట్రం పాలనలో వందల కోట్ల నిధులతో మట్టిరోడ్లు కనపడకుండా నగరంలో రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. 250 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని, త్వరలోనే డైనమిక్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి కేబుల్ బ్రిడ్జి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ స్తంభాల స్థానంలో విద్యుత్ టవర్లు వేశామన్నారు. మానెరు రివర్ ఫ్రంట్ నిర్మాణంతో సౌత్ ఇండియాలో అట్రాక్టివ్ సిటీగా కరీంనగర్ మారుతుందని అన్నారు.