Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్తును అందుకున్నారు. వన్డేల్లో శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దనే రికార్డును బ్రేక్ చేశాడు. జయవర్దనే 418 ఇన్నింగ్స్‌ల్లో 12,650 రన్స్ చేశాడు. కోహ్లీ 267 ఇన్నింగ్స్‌ల్లోనే 12,651 రన్స్ స్కోర్ చేశాడు. దాంతో కోహ్లీ వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగుల చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 18,426 రన్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. కుమార సంగక్కర (శ్రీలంక ఉ 14,234), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా - 13,704), సనత్ జయసూర్య (శ్రీలంక - 13,430) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.