Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: మూడో వన్డేలో భారత జట్టు భారీ విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇండియా 317 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడిచింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. అతని పేస్ దెబ్బకు టపటపా వికెట్లు కోల్పోయింది. కీలకమైన నవనిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క ఫెర్నాండో (1) చరిత అసలంక (1)లను సిరాజ్ అవుట్ చేయడంతో లంక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత షమీ, కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట కొనసాగించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓవర్లో లంక కెప్టెన్ దసున్ షనక బౌల్డ్ అయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయింది. 22వ ఓవర్ చివరి బంతికి కుమరను కుల్దీప్ బౌల్డ్ చేయడంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. దాంతో, మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో టీమిండియా గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ వన్డే చరిత్రతో అతి పెద్ద విజయం నమోదు చేసింది. ఇంతకుమందు 2008లో న్యూజిలాండ్‌పై 290 పరుగలు తేడాతో గెలిచింది.