Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తిరువనంతపురం వేదికగా భారత్ - శ్రీలంకల మధ్య జరిగిన జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో (2008లో) న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది.
2015లో అఫ్గానిస్థాన్‌పై 275 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా (272.. జింబాబ్వేపై, 2010), సౌతాఫ్రికా (258.. శ్రీలంకపై,2012), భారత్ (257.. బెర్ముడాపై, 2007), దక్షిణాఫ్రికా (257.. వెస్టిండీస్‌పై, 2015), ఆస్ట్రేలియా (256.. నమీబియాపై, 2003), భారత్ (256.. హంకాంగ్‌పై, 2008), పాకిస్థాన్ (255.. ఐర్లాండ్‌పై, 2016) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వన్డేల్లో వికెట్ల పరంగా భారీ విజయాల్లోనూ టీమ్ఇండియానే అగ్రస్థానంలో ఉంది. 1975లో ఈస్ట్ ఆఫ్రికాపై భారత్ 181 బంతులు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఆఫ్రికా 120 పరుగులకే కుప్పకూలగా.. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్.. వికెట్ నష్టపోకుండా 29.5 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్ జరిగినప్పుడు వన్డేల్లో 60 ఓవర్లుండేవి. 1981లో టీమ్ఇండియాపై న్యూజిలాండ్ 30 బంతులు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించిఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.