Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మోతీ దర్వాజా, జీఎంకే ఫంక్షన్ హాల్ ఎదురుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని నరికి చంపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని ఉప్పల్‌కు చెందిన కలీమ్(19)గా గుర్తించారు. కలీమ్‌ను హత్య చేసింది తామే అంటూ ముగ్గురు వ్యక్తులు గోల్కొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.