Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో రెండు రోజుల పాటు (16, 17 తేదీల్లో) ఈ సమావేశాలు జరుగుతాయి. నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్ లో పదాధికారులు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, సంఘటన్ మహామంత్రులు పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 17న సాయంత్రం 4 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి.