Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈరోజు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో భారత ఎన్నికల సంఘం భేటీ కానుంది. రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) మీద అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ మెషిన్ పనితీరు గురించి రాజకీయ పార్టీలకు వివరించడంతో పాటు పలు విషయాల మీద చర్చించనుంది. అందుకని 8 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఈ మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని ఈసీ కోరింది. అంతేకాదు ఈ కొత్త మెషిన్ల పనితీరుకు సంబంధించి, ఎన్నికల పద్ధతిలో మార్పులు, దేశంలోని వలస కూలీల గురించి తమఅభిప్రాయాలను రాత పూర్వకంగా జనవరి 31లోపు తెలియజేయాలని చెప్పింది. ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్నికల సంఘానికి చెందిన సాంకేతిక నిపుణులు కూడా పాల్గొననున్నారు.
బతుకుదెరువు నిమ్మిత్తం పొరుగు రాష్ట్రాలు, జిల్లాలకు వలస వెళ్లినవాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం భారత ఎన్నికల సంఘం సరికొత్త ఆలోచన చేసింది. డిసెంబర్ 29న మల్టీ కాన్స్టిట్యుయెన్సీ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) నమూనా మెషిన్‌ను ప్రదర్శించింది. దాంతో, ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నా సరే.. అక్కడి రిమోట్ పోలింగ్ స్టేషన్లలో ఓటు వేసే వీలుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడానికి అంతరాష్ట్ర వలసలు ప్రధాన కారణమని ఈసీ తెలిపింది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే.. వలస కూలీలు ఓటు హక్కు వినియోగించుకోవడం స్వరాష్ట్రానికి, జిల్లాకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, దాంతో, ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.