Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వచ్చే ఆరు రోజులపాటు చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ సోమవారం వెల్లడించింది. చలిగాలుల ప్రభావం వల్ల ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో సోమవారం ఉదయం ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్షియస్ కు పడిపోయింది. సోమవారం నుంచి వచ్చే ఆరు రోజుల పాటు ఐఎండీ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం దట్టమైన పొగమంచు కమ్ముకోవడం వల్ల ఉత్తర రైల్వే ప్రాంతంలో 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని భారతీయ రైల్వే తెలిపింది.పలు విమానాల రాకపోకల్లో కూడా జాప్యం జరిగింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద సోమవారం జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్ లో సైనికులు పాల్గొన్నారు. చలిగాలులు, దట్టమైన మంచు మధ్య పరేడ్ రిహార్సల్ సాగింది.