Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేపాల్
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ కూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దానిలో ఉన్న అందరూ మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో కీలక ఆధారమైన బ్లాక్‌బాక్స్ తాజాగా లభ్యమైంది. ఈ విషయాన్ని కాఠ్మాండూ ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఉదయం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలను విమానం వెనుక భాగంలో అమర్చి ఉండే ఈ బ్లాక్ బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందో బ్లాక్ బాక్స్ ద్వారా తెలుస్తుందన్నారు. బ్లాక్ బాక్స్‌లో ఫ్లయిట్ డాటా రికార్డర్‌తో పాటు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఉండటం వల్ల దర్యాప్తులో ఇది చాలా కీలకంగా మారుతుందని వెల్లడించారు.