Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈనెల 18న (బుధవారం) న్యూజిలాండ్-ఇండియా జట్ల మధ్య మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. తొలి వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికైంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టు సోమవారం హైదరాబాద్ చేరుకోనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ టికెట్లను ఆన్ లైన్లో విక్రయిస్తోంది. అన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఎల్బీ, గచ్చిబౌలి స్టేడియంలో ఫిజికల్ టికెట్స్ కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. గచ్చిబౌలి స్టేడియంలో 8 కౌంటర్స్‌ను హెచ్సిఏ ఏర్పాటు చేసింది.
కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈనెల 18న జరిగే తొలి మ్యాచ్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన కివీస్ బృందానికి హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రికెటర్లు పోలీసు ఎస్కార్ట్‌తో తమకు ఏర్పాటు చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం 4గంటల నుంచి ఉప్పల్ స్టేడియంలో కివీస్ జట్టు ప్రాక్టీస్ చేయనుంది. వన్డేల తర్వాత ఇరుజట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది.