Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం సమావేశమైంది. సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ఆర్వీఎం నమూనాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రదర్శించింది. ఆర్వీఎంల వినియోగంపై నిన్న కాంగ్రెస్ నేతృతంలో 16 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఆర్వీఎంలపై ఉన్న అనుమానాలపై ఈసీ సమాధానం తర్వాత ఒక వైఖరి తీసుకోవాలని విపక్ష పార్టీలు డిసైడ్ చేశాయి. అయితే ఆర్వీఎంపై ఈసీ ప్రతిపాదనను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీ(యూ), సీపీఐ, సీపీఐ(ఎం), ఆర్జేడీ, జేఎంఎం తదితర పార్టీల నేతలు ఢిల్లీలో సమావేశం అయ్యారు.