Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ సోషల్ షేరింగ్ యాప్ షేర్‌చాట్ మాతృ సంస్థ మొహల్లా టెక్ భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు 500 మందిని తొలగించింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 2,100 మంది పనిచేస్తుండగా.. అందులో 20 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించింది. గతంలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకున్న నేపథ్యంలో ఇప్పుడు అధికంగా ఉన్న వారిని తొలగించిట్లు తెలిసింది. తొలగింపు విషయాన్ని ఆ కంపెనీ ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ప్రభావితం కాని ఉద్యోగులకు సైతం సమాచారం చేరవేసింది. తొలగించిన ఉద్యోగులకు 2022 డిసెంబర్ వరకు నూరు శాతం వేరియబుల్ పేని చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే నోటీసు పీరియడ్ ఉన్న కాలానికి పూర్తి వేతనం చెల్లించనున్నారు. పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాలా చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. 2023 జూన్ వరకు ఆరోగ్య బీమా సదుపాయం కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. వాడుకోని సెలవులను గరిష్ఠంగా 45 రోజుల వరకు ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు.
ఐఐటీ పూర్వ విద్యార్థులైన సత్యదేవ, ఫరీద్ అషన్, భాను సింగ్ కలిసి 2015లో షేర్‌చాట్ యాప్‌ను ప్రారంభించారు. ప్రాంతీయ భాషలో కంటెంట్‌ను అందించడంతో అనతి కాలంలోనే ఈ యాప్ ప్రజాదరణ పొందింది.