Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ జనవరి 18న జరగనుండగా, సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారు. దీంతో నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ తరుణంలో మాట్లాడుతూ, ఒకప్పటి ఖమ్మంకు ఇప్పటి ఖమ్మంకు పోలికే లేదని అన్నారు. ఖమ్మంలో రూ.1,200 కోట్ల అభివృద్ధి జరిగిందని తెలిపారు.
ఖమ్మం వచ్చినప్పుడల్లా కొన్ని అంశాలు నేర్చుకుని పోతున్నానని, లకారం చెరువు, డివైడర్, చెట్లు ఇలా ఖమ్మంలో అనేక ప్రాంతాలను ఫొటోలు తీసుకుని ఇదే తరహాలో తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నట్టు హరీశ్ రావు వివరించారు.