Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మార్చి 5 నుంచి 23వరకు మహిళల ఐపీఎల్ తొలి సీజన్ జరగనుంది. ఈ క్రమంలో మహిళా ఐపీఎల్ మీడియా హక్కులను వైకొమ్ 18 మీడియా సంస్థ దక్కించుకుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి ఈ సంస్థ మీడియా ప్రసార హక్కులను సొంతం చేసుకుందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం తెలిపాడు.
ఈ తరుణంలో మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు గెలిచినందుకు వైకొమ్ సంస్థకు శుభాకాంక్షలు. బీసీసీఐపై మీకు ఉన్న విశ్వాసానికి ధన్యవాదాలు. మీడియా హక్కుల కోసం వైకొమ్ సంస్థ రూ.951 కోట్లు పెట్టడానికి సిద్ధమైంది. అంటే ఒక మ్యాచ్కు రూ.7.09 కోట్లు చెల్లించనుంది. పురుషుల జట్టుతో సమాన వేతనం తర్వాత మహిళల క్రికెట్కు మమర్దశకు ఇది అతిపెద్ద, కీలకమైన అడుగు అని జై షా ట్వీట్ చేశాడు. 2023-2027 వరకు మహిళల ఐపీఎల్ హక్కులను బీసీసీఐ, వైకొమ్ సంస్థకు కట్టబెట్టనుంది. మొత్తం ఐదు ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. జనవరి 25వ తేదీన మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలను ఆవిష్కరించనున్నట్టు సమాచారం.