Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీమిండియాతో తిరువనంతపురంలో జరిగిన వన్డే మ్యాచ్ లో శ్రీలంక రికార్డు స్థాయిలో 317 పరుగుల తేడాతో ఓడిపోవడం తెలిసిందే. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత భారీ ఓటమి. అయితే ఈ తరుణంలో శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జాతీయ జట్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలని టీమ్ మేనేజ్ మెంట్ ను ఆదేశించింది. కెప్టెన్ దసున్ షనక, కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్, టీమ్ మేనేజర్ తో పాటు సెలెక్షన్ కమిటీ ప్యానెల్ ను కూడా బోర్డు వివరణ కోరింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ స్పష్టం చేసింది.