Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ సోమవారం రెండు అంతర్రాష్ట్ర అక్రమ ఆయుధాల సరఫరా ముఠాల గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలకు సంబంధించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో వారి నుంచి 18 పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాల కోసం ఆర్డర్ చేశారని పోలీసు వర్గాల కథనం. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), పంజాబ్, హర్యానా, రాజస్థాన్, వెస్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తారని పోలీసులు తెలిపారు. నిందితులపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.