Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు-2 సినిమా షూటింగ్లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్లో పిచైక్కారన్- 2 సెట్లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం. విజయ్ వాటర్ బోట్లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలిపారు.