Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ రానుంది. సీ ఫర్ ఐఆర్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సేవలు అందిస్తోన్నది. తాజాగా భారత్లో తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. దావోస్లో జరుగుతున్న సదస్సులో తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సదస్సులో పాల్గొన్నారు.