Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
జనవరి 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ తరుణంలో తొలి వన్డేకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం (రాజీవ్ గాంధీ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో కొద్దిసేపటికే క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం టీమ్ఇండియా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో పార్క్ హయత్ హోటల్‌కి చేరుకున్నారు.
అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ రోజు మధ్యాహ్నమే హైదరాబాద్ చేరుకున్నాడు. ఓ యాడ్‌ఫిల్మ్ షూట్ కోసం కోహ్లీ ముందుగా వచ్చాడు. ఈ మ్యాచ్ కోసం కివీస్ ఆటగాళ్లు శనివారం ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. వారికి తాజ్ కృష్ణా హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సాధన చేసిన న్యూజిలాండ్ ఆటగాళ్లు సోమవారం కూడా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నారు.