Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుణ్యస్నానాల కోసం వెళ్లిన భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మోరిగావ్ జిల్లాలోని ధరామ్తుల్ ఏరియాలో జాతీయ రహదారి 37పై రోడ్డు ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా ఒకే ప్రాంతానికి చెందిన కొందరు లోహిత్ నదిలో పుణ్యస్నానాలకు వెళ్లారు. ఈ తరుణంలో పుణ్యస్నానాలు ముగించుకుని తిరిగి ఇళ్లకు వెళ్తుండగా వాహనం ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిని వారికి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు.