Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
యూఏఈ రాజధాని అబుదాబిలోని గోల్డెన్ వీసాదారులకు గుడ్‌న్యూస్. అన్ని కేటగిరీలకు గోల్డెన్ వీసా వ్యవధిని ఐదేళ్ల నుంచి 10ఏళ్లకు పెంచడం జరిగింది. అబుదాబి రెసిడెంట్స్ కార్యాలయంలోని ఆపరేషన్స్ డైరెక్టర్ మార్క్ డోర్జి మాట్లాడుతూ, అబుదాబిలోని అన్ని కేటగిరీలకు గోల్డెన్ వీసా గడువును పదేళ్లకు అప్డేట్ చేసినట్లు వెల్లడించారు. ఇక ఈ వీసాదారులు తమ జీవిత భాగస్వాములు, పిల్లలు, పేరెంట్స్‌కు వయస్సుతో సంబంధం లేకుండా స్పాన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే గోల్డెన్ వీసా హోల్డర్లు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పాటు యూఏఈ వెలుపల ఉండేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు ఈ నిర్ణయం విస్తృత శ్రేణి లాంగ్‌టర్మ్ రెసిడెన్సీల ఎంపికల కోసం మేలు చేస్తుందని ఈ సందర్భంగా మార్క్ డోర్జి తెలిపారు.