Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో ఈ దారుణం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 37 ఏళ్ల వ్యక్తి.. భార్య, పెద్ద కూతురితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగు నెలల క్రితం దుండిగల్ వెళ్లాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. 14ఏళ్ల వయసున్న పెద్ద కూతురును చదువు మాన్పించి పనికి తీసుకెళ్లాడు. తల్లి లేని సమయంలో దుండిగల్, సొంత గ్రామంలో బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. సంక్రాం తికి ఊరికి వచ్చిన బాలిక.. తండ్రి తనపై లైంగికదాడి చేస్తున్నాడని తల్లి, నాన్నమ్మలకు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భవతి అని తెలియడంతో.. కుటుంబీకులు, బంధువులు బాలిక తండ్రిపై దాడి చేశారు. బాధితురాలి తల్లి సోమవారం ఆమనగల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.