Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఏపీలోని అనంతపురం జిల్లా పోలీసుస్టేషన్ లో నిందితుడు ఒకరు అనుమానాస్పదస్థితిలో మరణించడంపై జిల్లా ఎస్పీ ఫకీరప్ప సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెన్షన్ చేశారు. జిల్లాలోని రాయదర్గం పైతోటలో గొర్రెల చోరీకి యత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుల్లో ఒకరైన ఆత్మకూరు మండలం సనప వాసి ఆంజనేయులు రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. నిందితుడి మరణంపై పోలీసు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండా గుట్టుగా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మంగళవారం స్టేషన్‌ను సందర్శించి అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారెక్‌లో ఉండాల్సిన నిందితులను కంప్యూటర్ గదిలో ఉందుకు ఉంచారని మండిపడ్డారు.
ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సీఐ శ్రీనివాసులుతో పాటు కానిస్టేబుళ్లు మధుబాబు, గంగన్నను సస్పెన్షన్, హోంగార్డు రమేశ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై అనంతపురం ఇన్చార్జి డీఎస్పీ మహబూబ్ బాషాను పూర్తిస్థాయి విచారణాధికారిగా నియమించారు. ఎన్హెచ్ఆరీసీ నిబంధనల మేరకు వైద్యుల బృందంతో పోస్టుమార్టం నిర్వహిస్తామని ఎస్పీ వెల్లడించారు.