Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కుటుంబ కలహాలతో ఓ పోలీసు అధికారి భార్య ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ పటమట పోలీసుల వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సీఐడీ సీఐ చంద్రశేఖర్ కుటుంబం విజయవాడ పటమట తోటవారి వీధిలో నివసిస్తోంది. చంద్రశేఖర్‌కు భార్య జ్యోతి (34), ముగ్గురు కుమార్తెలున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పిల్లలకు భోజనం పెట్టే దగ్గర దంపతుల మధ్య చిన్నపాటి వాగ్వాదమేర్పడింది. అనంతరం చంద్రశేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మనస్తాపానికి గురైన జ్యోతి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ముగ్గురు పిల్లలు తలుపు కొడుతూ పెద్దగా కేకలు వేసినా తెరవలేదు. వెంటనే పిల్లలు తండ్రి చంద్రశేఖర్‌కు ఫోన్ చేశారు. ఆయన వచ్చి చూడగా.. అప్పటికే జ్యోతి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.