Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ: బుద్గామ్
జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు మృతిచెందారు. ఓ అనుమానిత వాహనాన్ని ఆర్మీ, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ వాహనంలో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో జరిగిన ప్రతిదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. ఆ వాహనం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రికవరీ చేశారు. ఆ ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల్ని అర్బాజ్ మీర్, షాహిద్ షేక్‌లుగా గుర్తించారు. పుల్వామాకు చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్ నుంచి ఆ ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాద కదలికలపై సమాచారం రావడంతో.. బుద్గామ్‌లో చెక్ పాయింట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆర్మీ అధికారి తెలిపారు.