Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
‘బిచ్చగాడు’ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. తాజాగా ఆయన ‘బిచ్చగాడు-2’ షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుంది. కాగా వాటర్ బోట్ సీన్ చిత్రీకరిస్తుండగా విజయ్ గాయపడ్డాడు. విజయ్ ప్రయాణిస్తున్న వాటర్ బోట్, కెమెరామెన్ సిబ్బింది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయ్‌కు తీవ్రంగా గాయలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే తాజాగా డాక్టర్లు విజయ్ ఆరోగ్యం గురించి వెల్లడించారు.
ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నాడని, మేజర్‌గా దెబ్బలేవి తగడం లేదని చెప్పారు. అంతేకాకుండా విజయ్ వేగంగా కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు. విజయ్ తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక విజయ్ ఆంటోని ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఏడు సినిమాలున్నాయి. కాగా ‘బిచ్చగాడు-2’ సినిమాకు దర్శకుడు కూడా విజయ్ అవడం విశేషం. తెలుగులో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన విజయ్ ఆంటోని.. ‘సలీమ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఈ చిత్రం తర్వాత విజయ్ నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు ఇక్కడ కూడా విడుదలైంది. అయితే బిచ్చగాడు తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో విజయ్‌కు మరో హిట్టు పడలేదు.