Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ కొరియాకు చెందిన శామ్ సంగ్ భారత మార్కెట్లో రెండు బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఏ14 5జీ, గెలాక్సీ ఏ23 5జీ పేరుతో వచ్చిన ఈ రెండూ 5జీ టెక్నాలజీకి సైతం సపోర్ట్ చేస్తాయి. గెలాక్సీ ఏ14 5జీ డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.20,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.18,999. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.16,499. ఎస్ బీఐ, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ కార్డులపై రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ సిల్వర్, లైట్ బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.24,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.22,999. ఈ ఫోన్ పైనా బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 డిస్కౌంట్ పొందొచ్చు.