Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ధనుశ్ హీరోగా తెలుగులో 'సార్' సినిమా రూపొందింది. తమిళంలో ఈ సినిమాకి 'వాతి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితార నాగవంశీ .. సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'బంజారా' అనే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఇల్లేనాదని .. వాకిలి నాదేనంటే ఫక్కున నవ్వుతాది భూ తల్లి' అంటూ ఈ పాట మొదలవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. తెలుగు .. తమిళ భాషాల్లో ఒకే రోజున ఈ చిత్రం విడుదల కానుంది.