Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రోడ్లపై సభలు, రోడ్ షోలను నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ జీవోను కేవలం విపక్షాలపైనే పోలీసులు ప్రయోగిస్తుండటం విమర్శలపాలు అవుతోంది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా జీవో నెంబర్ 1ను పోలీసులు ప్రయోగించారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మంత్రులు రోడ్ షోలను నిర్వహించడం విపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ జీవోపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.