Authorization
Sat May 17, 2025 03:51:09 am
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై ప్రధాన కార్యదర్శి విజయ్ ఆనంద్ ఆరోపణలు గుప్పించారు. ఆయన తీరుపై మండిపడ్డారు. ఉప్పల్‌లో మ్యాచ్ విషయమై తనను కనీసం సంప్రదించలేదన్నారు. నన్ను బెదిరించి చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. కులం పేరుతో చిన్న చూపు చూస్తున్నారు. అజారుద్దీన్ నియంతలా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఆన్‌లైన్ టికెట్లలో కూడా గోల్‌మాల్ చేశారు. నాతోపాటు నా ప్యానెల్ మొత్తాన్ని పక్కనపెట్టారు. అని విజయానంద్ విమర్శించారు.