Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై దాడి చేసి చేయి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న భగీరథ్ తోటి విద్యార్థిపై చేయి చేసుకోవడమే కాకుండా రాయలేని భాషలో తిడుతూ చావబాదడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, పక్కనే ఉన్న భగీరథ్ స్నేహితుడు కూడా విచక్షణ రహితంగా బాధితుడిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ భగీరథ్ హెచ్చరించడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని మంత్రికి చెప్పినా ఎవరూ తనను ఏమీ చేయలేరంటూ భగీరథ్ రంకెలేశారు. భగీరథ్ ఇలా దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఢిల్లీలో చదువుకుంటున్న సమయంలోనూ ఆయన ఇలానే ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీంతో అతడిని భరించలేని కాలేజీ యాజమాన్యం బయటకు పంపించేసింది. ఇప్పుడు మహీంద్రా యూనివర్సిటీలో మరోసారి దురుసు ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి అండ చూసుకునే ఆయన ఇలా చెలరేగిపోతున్నాడని మండిపడుతున్నారు. బాధితుడిని గాయపరచడమే కాకుండా దుర్భాషలాడి, చంపేస్తామని బెదిరించిన బండి భగీరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.