Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది! టీఆర్ఎస్ బీఆర్‌ఎ్‌సగా మారిన తర్వాత తొలి భారీ బహిరంగ సభ బుధవారం ఖమ్మంలో జరగనుంది. నలుగురు ముఖ్యమంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు సహా దాదాపు వెయ్యిమంది వీవీఐపీలు సభకు హాజరుకానున్నారు. జాతీయ స్థాయికి విస్తరించాలని సంకల్పం చెప్పుకొన్న నేపథ్యంలో సభ నిర్వహణను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వామపక్ష ఉద్యమాలకు, తెలంగాణసాయుధ పోరాటానికి గుమ్మంగా నిలిచిన ఖమ్మాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుంది. బీఆర్‌ఎ్‌సతోపాటు ఆమ్ ఆద్మీ, వామపక్షాల ఐక్యత సభలో ప్రతిఫలించనుంది. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ హాజరు కానున్నారు. అలాగే, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా తదితరులు రానున్నారు. సభకు 20 వేల మంది వీఐపీలు, వెయ్యి మంది వీవీఐపీలు, బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు, సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, హాజరవనున్నారు.