Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండోనేషియా దేశంలో బుధవారం మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని సులావేసిలో 145 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైందని యూరోపియన్ మెడిటెర్రేనియన్ సీస్మాలజీ సెంటర్ తెలిపింది. ఇండోనేషియా దేశంలో సోమవారం కూడా భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపం తీరంలో భూకంప కేంద్రం అచే ప్రావిన్స్‌లోని సింగ్‌కిల్ నగరానికి దక్షిణ-ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 48 కిలోమీటర్ల లోతులో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. ఇండోనేషియా దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తున్నాయి.