Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్లలో ఒకరిగా పేరున్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సమరానికి బుధవారం తెరలేవనుంది. హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ (ఉప్పల్) స్టేడియం వేదికగా ఈ డే/నైట్ మ్యాచ్ జరుగనుంది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కివీస్‌తో పోరుకు సిద్ధమైంది. మరోవైపు పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపై ఓడించిన న్యూజిలాండ్ కూడా జోరుమీదుంది. భారత్‌పై కూడా సంచలన విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.