Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. సోమాజిగూడ నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వరకు ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్బీహెచ్ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్ ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు పైన పేర్కొన్న మార్గంలో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులు మ్యాచ్ ప్రారంభానికి, ముగింపు సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని తెలిపారు.