Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు రియల్ఎస్టేట్ కంపెనీలు, సినిమా ఫైనాన్సియర్ల ఇండ్లపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులునిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 50 బృందాలు ఏకాకలంలో సోదాలు ప్రారంభించాయి. బంజాహిల్స్ పరిధిలోని ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్మెంటులో, ఊర్జితా కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ఇంటితోపాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఆఫీసులు, వాటి యజమానుల ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఊర్జిత కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వీర ప్రకాష్ నివాసాలు, వారి కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ బిల్డర్ మాధవరెడ్డి, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్టలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.