Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు ఇటీవలి కాలంలో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కానీ నేడు మాత్రం కాస్త శాంతించాయి. తగ్గలేదు కానీ స్థిరంగా ఉండిపోయాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర రూ.60 వేలకు చేరుకుంటుందని నిపుణులు చెబితే.. ఇప్పటికే బంగారం ధర రూ.57 వేలకు చేరుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.400 వరకూ తగ్గింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,950