Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉప్పల్ లో జరగనున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులను మోహరించారు. 300 సీసీ కెమెరాలతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భద్రత కారణాల దృష్ట్యా స్టేడియంలోకి మొబైల్స్ తప్ప ఇతర వస్తువులను అనుమతించేది లేదని నిమిత్తం రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. ల్యాప్ప్టాప్, వాటర్ బాటిల్, బ్యానర్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్, కాయిన్స్, పెన్నులు, హెల్మెట్, బ్యాగ్స్, బయటి ఫుడ్, బ్యాటరీలు, బైనాకులర్స్ పై నిషేధం విధించారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది.