Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉందని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు రోహిత్ తెలిపాడు. లైట్ల వెలుతురులో స్కోర్‌ను డిఫెండ్ చేయాలనుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. ఇండియన్ జట్టులోకి కేఎల్ రాహుల్, అయ్యర్, అక్షర్ స్థానాల్లో హార్ధిక్, ఠాకూర్, కిషన్‌లను తీసుకున్నారు. కివీస్ జట్టుకు లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు.