Authorization
Sat May 17, 2025 01:49:22 am
నవతెలంగాణ హైదరాబాద్: మహారాష్ట్రను కోడిగుడ్ల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఆ రాష్ట్రానికి ప్రతి రోజు సుమారు కోటి కోడిగుడ్ల కొరత ఉన్నట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పేర్కొన్నది. ఆ కొరతను తీర్చేందుకు ఆ శాఖ ప్రణాళికలు రచించినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రతి రోజు 2.25 కోట్ల కోడిగుడ్లను తింటున్నారు. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు 1.25 కోట్ల గుడ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో తీవ్ర కొరత ఏర్పడింది. కర్నాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి గుడ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు పశుసంవర్ధక శాఖ కమీషనర్ డాక్టర్ ధనంజయ్ పార్కలే తెలిపారు. ఔరంగబాద్‌లో గత రెండు నెలల నుంచి గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. 100 గుడ్లు రూ.575 ఇస్తున్నారు. గడిచిన రెండు నెలల నుంచి ధరలు అధికంగా ఉన్నట్లు ఓ స్థానిక వ్యాపారి తెలిపారు.