Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకా ఆదివాడి గ్రామంలో ఐశ్వర్యరాయ్ ఒక హెక్టారు భూమి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ కి టాక్స్ విషయంలో లీగల్ నోటిసు అందాయి. ఈ భూమిపై 21,960 టాక్స్ చెల్లించాల్సి ఉంది. నాసిక్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి పదేపదే రిమైండర్ వచ్చిన తర్వాత కూడా ఐశ్వర్య టాక్స్ కట్టలేదు. దీంతో ఆమె లీగల్ నోటీసులు పంపించారు. లీగల్ నోటీసు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లీగల్ అడ్వైజర్ ని అన్ని బకాయిలను క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ తరుణంలో సిన్నార్ తహసీల్దార్ ఏక్నాథ్ బంగాలే మీడియాతో మాట్లాడుతూ. ఐశ్వర్యరాయ్ విండ్మిల్లో పెట్టుబడి పెట్టింది. 2009లో కొనుగోలు చేసిన భూమికి ఇన్నాళ్లూ ఆమె టాక్స్ చెల్లించింది. ఈ నిర్దిష్ట అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన పన్ను మాత్రమే పెండింగ్లో ఉంది. ఇటివలే జనవరి 9న పది రోజుల్లోగా పన్ను చెల్లించాలి అంటూ మరోసారి నోటీసు పంపించాం. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లీగల్ అడ్వైజర్ రేపటిలోగా పన్ను చెల్లిస్తారని మాకు తెలిపారు అని చెప్పారు. అయితే ఐశ్వరరాయ్ కి మాత్రమే కాదు సిన్నార్ మండల పరిధిలో ఉన్న టాక్స్ కట్టని దాదాపు 1200 మందికి లీగల్ నోటీసులు పంపించారు.