Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఖమ్మం: బీజేపీ విధానాలను స్పష్టంగా వ్యతరేకిస్తున్నందునే బీఆర్ఎస్ ను బలపరుస్తున్నామని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భవ సభలో తమ్మినేని మాట్లాడుతూ బీజేపీ సాధాసీదా పార్టీ కాదని ఫాసిస్ట్ పార్టీ అని అన్నారు. ధాన్యం విషయంలో, రాష్ట్రాల హక్కుల విషయంలో, ఇతర విషయాల్లో కూడా గత ఏడాది నుంచి కేసీఆర్ స్పష్టమైన వైఖరి తీసుకొని బీజేపీపై పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకర బీజేపీని అడుగు పెట్టకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతిచోట అంతకు ముందు మత ఘర్షణలు సృష్టించింది. తెలంగాణ గడ్డ పోరాటల గడ్డ .. ఇక్కడ ప్రజలందరూ అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉంటారు. అలాంటి గడ్డపై మత చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇక్కడ బీజేపీ ఆటలు సాగనీయమని, కచ్చితంగా కమ్యూనిస్టులే బీజేపీని అడ్డుకుంటారని తమ్మినేని స్పష్టం చేశారు.
అదే వేదిక నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అనేక సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. సీతారామ ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాచేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జిల్లా తిష్టవేసిన అనేక సమస్యలను పరిష్కరించాలని తమ్మినేని కోరారు.