Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇదే తరుణంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శుభ్ మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అటు గిల్, ఇటు రోహిత్ ఆరంభం నుంచే మంచి షాట్లతో అలరించారు.
ఫోర్లు, సిక్సర్లు కొడుతూ 12 ఓవర్లలో తొలి వికెట్ కు 60 పరుగులతో మంచి పునాది వేశారు. కానీ, టిక్కర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ మిడాన్లో డారిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో, 34 పరుగులకే అతను వెనుదిరిగాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) సూర్యకూమార్ యాదవ్ ( 31) వెనుదిరగగా..క్రీజులో హర్దిక్ పాండ్యా (6), తో కలిసి గిల్ (109)సెంచరీతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం భాతత్ స్కోరు 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 తో కొనసాగుతుంది.