Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీడీసీఎల్ డి ఈ పులుసం నాగేశ్వరరావు
- మేడారంలో విద్యుత్ పనులు ప్రారంభం
నవతెలంగాణ -తాడ్వాయి
వచ్చేనెల ఫిబ్రవరి 1 నుండి 4 వరకు జరుగు మినీ మేడారం జాతరకు (మండెమేలిగే పండుగ) మేడారంలో నిరంతరాయంగా విద్యుత్ వెలుగులు అందించడానికి ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్, డి ఈ పులుసం నాగేశ్వరరావు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, స్థానిక ఏ ఈ వేణు కుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ పనులు ప్రారంభమయ్యాయి. నూతనంగా 10 ట్రాన్స్ఫార్మర్లను అమర్స్తున్నారు. అందులో భాగంగా బుధవారం మేడారం రెడ్డిగూడెం ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సంబంధించిన చిన్న చిన్న మైనర్ రిపేర్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైటింగ్ సిస్టం, తదితర విద్యుత్ పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గద్దెల ప్రాంతంలో గల ట్రాన్స్ఫార్మర్ను అమర్చారు. విద్యుత్ అధికారులు ఎండోమెంట్ అధికారులతో కలిసి మేడారం పరిసర ప్రాంతాలు పరిశీలించి ముమ్మరంగా విద్యుత్ సమస్యలను పరిష్కారిస్తున్నారు.
విద్యుత్ అంతరాయం
మినీ మేడారం జాతర విద్యుత్ సౌకర్యాల కోసం విధులు నిర్వహిస్తున్న దృష్ట్యా మేడారం ప్రాంతంలో గల మేడారం, కొత్తూరు విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో గల మేడారం ఊరటం నాగలాపురం వెంగళపురం కాలవపల్లి బైకపేట గ్రామపంచాయతీ పరిధిలోగల గ్రామాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫీడర్ల మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ పేర్కొన్నారు. అందుకని పైన తెలిపిన గ్రామాల్లో విద్యుత్తు అంతరాయం జరుగుతుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.