Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట నమోదు చేసుకోవాలి
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని కౌశెట్టివాయి, నర్సాపూర్ (పిఏ) గ్రామాలలో యాసంగి పంటలను బుధవారం ములుగు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఏ కె గౌస్ హైదర్ స్థానిక వ్యవసాయ శాఖ అధికారి కోరిక జై సింగ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ సర్పంచ్ మంకిడి నర్సింహా స్వామి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్ మాట్లాడుతూ ప్రతి రైతు మండల వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతు సోదరులందరూ పీఎం కిసాన్ కు సంబంధించి బ్యాంకు ఖాతా నెంబర్ కు, తమ ఆధార్ కార్డును అనుసంధానించి, ఈ కేవైసీ తప్పకుండా చేసుకోవాలన్నారు. వరి నారుమడుల లలో మిడుతల నివారించడానికి యజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. వరి ఎకరానికి నాలుగు టన్నుల పశువుల ఎరువును వాడాలన్నారు. దుక్కిలో 150- 200 కేజీల కింగల్ సూపర్ పాస్ఫేట్ వాడాలని సూచించారు. యూరియా ఎకరాకు 40 కేజీలు, న్యూ రేట్ ఆఫ్ పొటాష్ ను ఎకరాకు 30 కేజీలు వాడాలని తెలిపారు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కేజీల జింకు పాస్పోర్ట్ తప్పకుండా వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జిజే రవికుమార్, భవాని, రైతులు తదితరులు పాల్గొన్నారు.