Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణలో మరో మూడువేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మరో రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ రూ.2 వేల కోట్లను, యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్ అనే సంస్థ రూ.1000 కోట్ల పెట్టబడిని పెట్టనున్నట్టు ప్రకటించాయి. అందులో భాగంగా మౌలిక సదుపాయల కల్పన కోసం రెండువేల కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడి పెడతామని ఎయిర్టెల్ ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలీయన్‌లో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుతో భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు -చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్‌ల సమావేశం తరువాత ఎయిర్టెల్ సంస్థ ఈ ప్రకటన చేసింది. 60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ రాబోతుందని, డేటా భద్రతలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డేటాసెంటర్ రాబోయే 5-7 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది. తెలంగాణలో హైపర్ స్కేల్ డేటాసెంటర్లు ఏర్పాటుచేస్తున్న భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. తన అనుబంధ సంస్థ అయిన నెక్స్ట్రా ద్వారా భారతీ ఎయిర్ టెల్ ఈ డేటాసెంటర్‌ను నెలకొల్పుతుంది.