Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆ విమానం పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి సింగపూర్ వెళ్తున్నది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాలి. అయితే దాదాపు 5 గంటల ముందే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో 35 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం 35 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలేసి వెళ్లిపోయింది. నిర్ణీత సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకు అమృత్సర్ నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉన్నది. అయితే మధ్యాహ్నం 3 గంటలకే అమృత్సర్ నుంచి వెళ్లిపోయింది. దీంతో సింగపూర్‌కు టికెట్లు బుక్‌చేసుకున్న ప్రయాణికులు అవ్వాక్కవ్వాల్సి వచ్చింది.
కాగా, విమాన సమయంలో జరిగిన మార్పుల గురించి ప్రయాణికులకు తాము ముందుగానే తెలియజేశామన్నారు. ప్యాసింజర్లకు ఈ-మెయిల్ చేశామని అధికారులు వెల్లడించారు. గత నెలలో కూడా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకున్నది. ఢిల్లీకి వెళ్తున్న గో ఫస్ట్ ఫ్లైట్ విమానం 50 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలి వెళ్లడం గమనార్హం.