Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబయి-గోవా జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది దుర్మరణం చెందారు. ముంబయి-గోవా జాతీయ రహదారిపై రాయగఢ జిల్లాలోని మంగాన్ ఏరియాలోని రేపోలి గ్రామం వద్ద వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొంది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించగా, మరో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని స్థానికులు కాపాడారు. ఈకో కారు, ట్రక్కు ఎదురెదురుగా వస్తూ గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఢీకొన్నాయని పోలీసులు చెప్పారు. మృతుల్లో నలుగురు మహిళలున్నారు. గోరేగాం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.